విశాఖలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు చేయాలి

వైజాగ్: గాజువాక లంక గ్రౌండ్స్ లో శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వినాయక స్వామి వారి సాక్షిగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ గాజువాక శాసనసభ్య ఇన్చార్జ్ కే.ఎన్.ఆర్ (కరణం రెడ్డి నర్సింగ్ రావు) ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీ.వీ.ఎల్ నరసింహారావుకి అప్ సబ్ కి ఆవాజ్ సెక్రెటరీ కిరణ్ కుమార్ బావిశెట్టి ఆంధ్రాలో యు ఎస్ కాన్సులేట్ విశాఖలో ఏర్పాటు చేయాలి అని వినతి పత్రం అందజేశారు. విశాఖపట్నంను పర్యాటక ప్రాంతంగానే చూస్తున్నారే తప్ప రెవెన్యూ పరంగా కూడా విశాఖ చాలా ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు. ఇందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అలానే వీసా ఇక్కట్లు తోలుగుతాయని తెలియజేశారు. మన రాష్ట్ర ప్రజలు రెవెన్యూ పక్క రాష్ట్రాలకు పోతుందని ఇలాంటిది రెవెన్యూ మన ఆంధ్రాకి చాలా అవసరం అని తెలియజేశారు. దీనికి జీ.వీ.ఎల్ నరసింహారావు ఇలాంటి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా మంచిదని ఈ విషయాన్ని వెంటనే కేంద్రంకి తెలియజేసే బాధ్యత తను స్వీకరిస్తున్నానని తెలియజేశారు. అనంతరం ఆప్ సబ్ కి అవాజ్ దివ్యాంగుల చైర్మన్ కర్రీ దినేష్ విహార్ దివ్యాంగులకు ఉపాధి కల్పనకు సంబంధించి కాఫీ షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అధికారులకు నాలుగు మాసాలు క్రితం వినతి పత్రాలు అందజేసినా ఇప్పటికీ పర్మిషన్లు రాకపోవడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి జి.వి.ఎల్ కి తెలియజేశారు. ఆయన ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమస్త జాయింట్ సెక్రటరీ కొండేటి భాస్కర్, వీరేశ్వర రావు, కొమరం శెట్టి నాని, మజ్జి ధనుంజయ్, కృష్ణం శెట్టి ప్రసాద్ మరియు జే.వీ.డి మురళీకృష్ణ పాల్గొన్నారు.