తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. శుక్రవారం నిర్మల్‌లో మధ్యాహ్నం 12గంలకు జరగనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. సభ ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతున్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో బీజేపీ సభ నిర్వహిస్తోంది. అమిత్ షా హాజరుకానున్న నేపధ్యంలో నిర్మల్ సభను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. కనీసం లక్షమందికి తగ్గకుండా సభ నిర్వహిస్తామని కమలనాథులు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు అమిత్ షా సభకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. కాగా రేపు కాంగ్రెస్ సభ ఉండటంతో నిర్మల్ సభపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమిత్ షా బేగంపేట్ లేదా నాందేడ్ నుంచి నిర్మల్ సభకు వెళ్ళనున్నారు.