కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన.. సీపీఐ నారాయణ ముందస్తు అరెస్ట్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. షా నేటి తిరుపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు తిరుపతి బైరాగిపట్టెడలో వాకింగ్ చేస్తున్న నారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.