శ్రీ పారుపుడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న అమ్మిశెట్టి వాసు

విజయవాడ, వాకా ఓంకార్ ఆహ్వానం మేరకు ఆదివారం ఉయ్యూరు టౌన్లో వెలసియున్న శ్రీ పారుపుడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ ఉత్సవాలలో జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా, ఉయ్యూరు టౌన్ జనసేన నాయకులు డా.కార్తికేయ, మెరుగు చిన్న కోటయ్య, సనక కిరణ్, కాటూరి శ్రీనివాసరావు, బుర్లే రవి కుమార్, సాయి కిరణ్, నాగశ్రీ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.