నేడు ప్రకాశం జిల్లాలోకి అమరావతి ‘మహాపాదయాత్ర’

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది.

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్ర ఇవాళ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర పెదనందిపాడులో ప్రారంభమైన 14 కి.మీ మేర సాగి ఇవాళ పర్చూరులో ముగియనుంది. 45 రోజుల పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా యాత్ర సాగనుంది. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు.