అమలాపురం, శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు ఆదేశాల మేరకు ఆముడా చైర్మన్ ఆల్లాడి స్వామి నాయుడు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అమలాపురం పట్టణం 29వ వార్డులో ఉన్న హిందూ స్మశాన వాటికలో జరుగుతున్న ఆదునీకరణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వామి నాయుడు మాట్లాడుతూ 2014లో అప్పటి టిడిపి ప్రభుత్వంలో ఉండగా దాతలు మరియు ప్రభుత్వ నిధులతో ఈ స్మశాన వాటికను ఆధునికరించారని పక్కా బిల్డింగ్ తో పాటు దహన సంస్కారాలకు ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేశారని. ఆ తర్వాత 2019లో కరోనా మహమ్మారి కారణంగా అప్పటి నుండి ఈ స్మశాన వాటిక నిర్వహణ లేక పూర్తిగా శిథిలావస్థకు వచ్చిందని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు పార్టీలకు అతీతంగా అమలాపురం పట్టణ మున్సిపల్ కౌన్సిలర్స్ ఈ స్మశాన వాటికను సందర్శించడమే కాకుండా శాసనసభ్యులను కలవడం అయన స్పందించి మున్సిపల్ అధికారులను వెంటనే ఆ స్మశాన వాటికను దహన సంస్కారాలకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని ఆదేశించారనీ, అప్పటినుండి ఇక్కడ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి తొందర్లోనే అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, ఆశెట్టి ఆదిబాబు, పడాల నానాజీ, వలవల శివరావు, దినేష బాబు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment