సొంత ఖర్చులతో గుంతల రోడ్లను పూడ్చిన ఆముదాలవలస జనసేన

ఆముదాలవలస నియోజకవర్గం, బూర్జమండలం, సింగన్నపాలెం గ్రామం వద్ద జనసేన నాయకులు కిలోమీటర్ గుంతలు రోడ్డును 30వేలు రూపాయలు సొంత నిధులతో రోడ్లును మరమ్మతులు చేయటం జరిగింది. నన్ను గెలిపించిన ఈ గ్రామానికి నేను ఎప్పుడు అండగా ఉంటానని ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కారణం అయిన శ్రీ కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, కొల్ల జైరాం, తులగాపు మౌళి, తిరుపతి మరియు సింగన్నపాలెం గ్రామ యువత అని ఎంపీటీసి విక్రమ్ కార్యక్రమంలో తెలిపారు. అలానే వచ్చిన ప్రతి వాహనదారులకి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అధికారాలుకు ఇంకా కొన్ని రోడ్లుని మరమ్మతులు చెయ్యాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయటం జరిగింది.