సింగరాయకొండ గ్రామ ప్రజలకు వివరణ ఇవ్వాలి: జనసేన డిమాండ్

  • ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..!
  • ఉగాది పండుగ రోజున గ్రామ సభ నిర్వహించాలని ప్రయత్నం చేసిన సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర.

కొండెపి, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజున అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభ నిర్వహించాలని డి ఎల్ పి ఓ ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహిస్తున్నట్టు చెప్పిన కార్యదర్శి శరత్ చంద్ర. వార్డు సభ్యులకు రాత్రి సమయంలో వాట్సప్ లో మెసేజ్ పెట్టమని, గ్రామ ప్రజలకు దండోరా వేసి తెలియపరచవద్దని, గ్రామసభకు అధ్యక్షత వహించవలసిన సర్పంచ్ తాటిపర్తి వనజ లేకుండా, గ్రామసభ పెట్టమని చెప్పిన విధంగా సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర వ్యవహరించిన తీరు..? వివరాళలోకి వెళితే సింగరాయకొండ గ్రామ ప్రజలకు తెలిసి గ్రామ సభకు వస్తే ప్రజలు వార సమస్యలను చెప్తారని సమస్యల మీద దృష్టి పెట్టి సమస్యలు తీరిస్తే డబ్బులు ఖర్చవుతుందని, గ్రామ ప్రజలు లేకుండా వార్డు మెంబర్స్ లేకుండా వారు వచ్చినట్లుగా సంతకాలు పెట్టుకుని ప్రజలు సమస్యలు చెప్పినట్లుగా నాలుగు ఫోటోలు తీసుకొని పై అధికారులు పంపి మరలా గ్రాండ్ పొంది, వచ్చిన నిధులను మళ్ళీ స్వాహా చేయాలి అన్న విధంగా సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర వ్యవహరించడం జరిగినది. దీనిపై సింగరాయకొండ మండల ప్రజలు ఆవేదన, గత నెలలో డి ఎల్ పి ఓ సింగరాయకొండ గ్రామపంచాయతీలో 14 లక్షలు రూపాయలు అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా, విధుల నుండి సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర ను తొలగించకపోవడంపై, పై అధికారులకు ముడుపులు అందాయని సింగరాయకొండ గ్రామ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఉగాది పండుగ రోజున రాష్ట్ర ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉందని, రాష్ట్ర ప్రజలు మరియు సింగరాయకొండ గ్రామవాసులు వాపోతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును, ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులకు, దొంగలకు, కబ్జాదారులకు అండగా నిలబడటం తప్ప, ప్రజలు జరిగే మంచేమీ లేదని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్రని ఈ గ్రామ సభపై సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ వివరణ అడుగగా సమాధానం ఇవ్వకుండా అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయిన కార్యదర్శి శరత్ చంద్ర. సింగరాయకొండ గ్రామ ప్రజలను మోసం చేస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్రను వెంటనే విధులను నుండి తొలగించవలెనని మరియు గ్రామపంచాయతీ సర్పంచ్ తాటిపర్తి వనజ సింగరాయకొండ గ్రామ ప్రజలకు వివరణ ఇవ్వవలెనని, జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.