చేనేత కళాకారులను సన్మానించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి: ఆదివారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని పేద చేనేత కళాకారులను సన్మానించి వారికి నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.

అనంతరం చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను సన్మానించడం సంతోషమని అలాగే నేడు చేనేత కళాకారులు దినస్థితిలో ఉన్నారని చేనేత కళ అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వాలు చేనేత కళను ప్రోత్సహించి బక్క చిక్కిన నేతన్నను బ్రతికించాలని కోరారు.

అలాగే మంగళగిరి పట్టణంలో అర్హులైన చేనేత కళాకారులకు కూడా నేతన్న నేస్తం పథకం వర్తింప చేయట్లేదని కేవలం కొంతమందికి మాత్రమే ఇస్తున్నారని ఎప్పటికైనా అధికారులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నేతన్న నేస్తం వర్తింపజేయాలని చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు.

అనంతరం చేనేత కళాకారులు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయంలో వారిని సన్మానించడం ఆనందంగా ఉందని అలాగే పవన్ కళ్యాణ్ గారు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం గర్వకారణంగా ఉందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు లకు చేనేత కళాకారులు ఆశీస్సులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం సాంబశివరావు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, మంగళగిరి-తాడేపల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ వెంకట మారుతీ రావు, మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చిట్టెం అవినాష్, యర్రపాలెం గ్రామ జనసేన నాయకులు సుందరయ్య, మంగళగిరి మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి నందన్, తాడేపల్లి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, చంద్రశేఖర్, రత్నాల చెరువు జనసైనికులు కమేష్, గోపి, శివ చీరాల జనసైనికులు కర్ణ కిరణ్ తేజ, పసుపులేటి సాయి, దేవన సంతోష్, బాల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.