రైతులను తెలివిగా మోసం చేస్తున్నవారిపై సిఐడి విచారణ చేపట్టి.. నిజానిజాలు నిగ్గు తేల్చాలి: పంతం నానాజీ

జనసేన పార్టీ ఎప్పటినుంచో చెబుతూనే ఉంది రైతులను వైసీపీ నాయకులు, అధికారులు, దళారులు, మిల్లర్లు కలిసి మోసం చేస్తున్నారని. అయినా ఎవరూ పట్టించుకోలేదు.. ఇదే విషయాన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి గోదావరి జిల్లా వైసిపి కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ బుధవారం రైతులకు జరుగుతున్న అన్యాయంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఎం.పి బోస్
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత
రబీ ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతోందని తెలిపారు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ.. పై విషయాలపై విచారణ చేయాలనీ మరియు 17వేల మంది రైతులు ఆధార్ తో లింక్ కాలేదని.. దీనిలో రైస్ మిల్లుల యజమానులు, దళారులు, అధికారుల జోక్యం వుందన్నారు. ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై సిఐడి విచారణ చేపట్టి, నిజానిజాలు నిగ్గు తెల్చాలని, ధాన్యం బస్తాకి 200 రూపాయలు పక్కకి వెళ్లిపోతున్నాయని తెలిపారు. అవి ఎవరికి చేరుతున్నాయో విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలనీ.. అదేవిదంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు బొండాలరకం వేయవద్దని ఊరురా చాటింపు వేయించారు. నేడు ఈ బొండాల రకం ధర 1500-1600 పలుకుతోంది.. డబ్బులు ఇచ్చి మరీ కొనుకుంటున్నారు అని.. ఈ నష్టాన్ని ఎవరు పురిస్తారో తెలపాలని పంతం నానాజీ కోరారు.