సీనియర్ మెగాభిమానుల ఆత్మీయ సమావేశం

*ప్రజలతో మెగా సైన్యం పేరుతో సేవా కార్యక్రమాలు

*పవన్ కళ్యాణ్ భావజాలాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

నాలుగు దశాబ్దాల కాలంగా రక్తదానం, నేత్ర దానం వంటి కార్యక్రమాలతో పాటూ అన్నార్తులను, ఆపన్నులను ఆదుకుంటూ సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మెగా ఫ్యామిలీ అభిమానులు ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రజలతో మెగా సైన్యం పేరుతో జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి, జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి తెలిపారు. శనివారం అరండల్ పేటలోని ఒక హోటల్ లో జిల్లాలోని సీనియర్ మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఏ సినిమా నటుడి అభిమానులు చేయని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక్క మెగా ఫ్యామిలీ అభిమానులకే చెల్లిందని కొనియాడారు. అనారోగ్య సమయంలోనూ, ప్రమాదాలు జరిగి రక్తం అవసరమైన ప్రతీ సందర్భంలోనూ ప్రతీ ఒక్కరికి మొదట గుర్తుకు వచ్చేది చిరంజీవి అభిమానులేనన్నారు. హైదరాబాద్ లోని ఒక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారానే లక్షల యూనిట్లు రక్తాన్ని అందించిన ఘనత మెగా ఫ్యామిలీ అభిమానులకే దక్కిందన్నారు. సమాజానికి, ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా, సునామి లాంటి ప్రకృతి విపత్తులలోనూ, కరోనా లాంటి ప్రమాదకర మహమ్మారి విరుచుకుపడ్డ సమయంలోనూ మెగా అభిమానులు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయటంలో మెగాభిమానులు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. పవన్ కళ్యాణ్ భావజాలాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యతను ప్రతీ అభిమాని తీసుకోవాలని ఆళ్ళ హరి అన్నారు. గిడుతూరి సత్యం మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన అఖిల భారత చిరంజీవి యువత నాయకులు రవణం స్వామి నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. కంకణాల శంకర్ మాట్లాడుతూ అభిమాలందరికి ఆరాధ్య దైవమైన కొణిదెల నాగబాబు చూపిన మార్గంలో తామంతా ముందుకు సాగుతామని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ అభిమానులు సుధాకర్ రెడ్డి, కే, శంకర్, నవబోతు తేజ, తిరుమలశెట్టి సాంబశివరావు, గుగ్గిళ్ల సురేష్, సోమి ఉదయ్ కుమార్, బాషా తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment