నర్సంపేట జనసేన ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం

  • అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పనిచేస్తూ నియోజకవర్గఒలో పార్టీ బలోపేతం కోసం మరింత బలంగా కృషి చేద్దాం.
  • ప్రజా సంక్షేమం కోసం, సామాన్యుల కోసం పుట్టిన పార్టీ జనసేన
  • ప్రతి జన సైనికుడు నాయకత్వ లక్షణాలు అలవరుచుంకుంటు గొప్ప నాయకులుగా ఎదగాలి – నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్

నర్సంపేట నియోజకవర్గం, వరంగల్: గురువారం జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా నర్సంపేట నియోజకవర్గ నాయకుడు మేరుగు. శివ కోటీ యాదవ్ అధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో జనసేన ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ జన అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో ఎన్నో సామాజిక, ప్రజా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమిష్టిగా పార్టీని ప్రజల్లోకి తీసుకవెళ్లి అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిని నర్సంపేట నియోజకవర్గం వైపు మరల్చి ప్రశంసలు అందుకోవడం సంతోషనీయం. మరియు ఇది నియోజకవర్గ జన సైనికులందరి సమిష్టి విజయం అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళుతూ ప్రజాసంక్షేమం లక్ష్యంగా నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం మరింత బలంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే సామాన్యుల కోసం పుట్టిన పార్టీ జనసేన అని, ప్రతి జన సైనికుడు నాయకత్వ లక్షణాలు అలవరుకుంటు గొప్ప నాయకులుగా ఎదగాలి అని కోరారు.

ఈ సమావేశంలో జనసేన ముఖ్య నేతలు వంగా మధు, ఒర్సు. రాజేందర్, రాపోలు సురేష్, గంగుల రంజిత్, ఎలబోయిన డేవిడ్ రాజ్, తడక శ్రావన్, కొలువుల కార్తీక్, గాండ్ల అరున్ మరియు క్రియాశీలక సభ్యులు రాసమల్ల పవన్ కళ్యాణ్, అందే రంజిత్, కొమ్మ బిరాన్, చిదురాల మాధవశంకర్, షేక్ పాషా, మాదారపు కృష్ణ, గద్దల కిరణ్ తదితరులు పాల్గొని పార్టీ బలోపేతం పైన వారి అభిప్రాయాలను వెలుబుచ్చారు.