ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ

• సీఎం ముసాఫిర్ ఖానా పై స్పందించాలి.
• పంజా సెంటర్లో ఉన్న ముసాఫిర్ ఖానా పై వెల్లంపల్లి అవినీతి డేగలు వాలిపోయా వక్ఫ్ యాక్ట్ కు తూట్లు పొడుస్తున్నారు
• అమ్మవారి ఆలయాన్ని దోచుకున్న విధంగానే ముసాఫిర్ ఖానా దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
• వెల్లంపల్లి అనుచరులకు కళ్ళు మూసుకొని సహకరిస్తున్న వక్ఫ్ సీఈఓ మరియు చైర్మన్.

విజయవాడ, ముఖ్యమంత్రి వర్యులు తమరి చేతులతో ప్రారంభించిన పంజా సెంటర్లోని ముసాఫిర్ ఖానాపై పశ్చిమ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి డేగలు వాలి వక్ఫ్ యాక్ట్ కు తూట్లు పొడుస్తూ ముసాఫిర్ ఖానా లోని షాపులను, టెంట్ హౌస్, లైటింగ్, డెకరేషన్ కాంట్రాక్ట్ లను వక్ఫ్ యాక్ట్ 2014 మరియు 2020 నిబంధనలను వ్యతిరేకంగా లక్షల రూపాయలును లబ్ధిగా పొంది టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతి ద్వారా అక్రమంగా కట్టబెట్టాలనే వారి ప్రయత్నాలకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు సీఈఓ గుడ్డిగా అడ్డదారిలో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రయత్నాలకు సహకరిస్తున్నారనే మాటలు బయట వినిపిస్తున్నాయి. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు సీఈవో వక్ఫ్ యాక్ట్ ప్రకారం మాత్రమే ముసాఫిర్ ఖానా టెండర్లను ఆహ్వానించాలని, 3000 రూపాయల నెలసరి అద్దె దాటిన వక్ఫ్ ఆస్తుల లీజు విషయంలో వక్ఫ్ యాక్ట్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, టెండర్స్ ను ఆన్లైన్, సీల్డ్ మరియు ఓపెన్ విధానంలోనే ప్రకటించాలని మరియు ఒకటి కన్నా ఎక్కువ టెండర్లు రానియెడల మరల ప్రకటన జారీ చేయాలని ప్రకటనలు జాతీయ రాష్ట్ర స్థానిక పత్రికలో కచ్చితంగా ప్రచురించాలని నిబంధనలను పాటించే విధంగా తమరు తప్పక చర్యలు తీసుకోవాలని లేని ఎడల ఈ సమస్యపై ఉద్యమిస్తామని తెలిపారు.