జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న నిర్లక్ష్య వైఖరిపై గళం విప్పిన అనకాపల్లి జనసేన నిరసన

అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 200 పడకల ఆసుపత్రిగా సామర్ధ్యం పెంచుకున్నా అదే సిబ్బందితో సేవలు అందిస్తుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీటీ స్కాన్ పనిచేయకపోవడం, ల్యాబ్ టెస్ట్ లు నిర్వహించకపోవడం, ఈసీజి మెషిన్ పనిచేయకపోవడం, రోగులకు తగ్గ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, సరిపడా సిబ్బంది లేకపోవడం, ఎన్ని సార్లు సూపరిండెంట్ కి వినతి పత్రం ఇచ్చినా నిర్లక్ష్యంతో వారి నుండి స్పందన లేకపోవడం. అనకాపల్లి టీం జనసేన నిరసన తెలియజెసింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి టీం జనసైనికులు శ్రీరాందాస్ గోవింద్, తాడి రామకృష్ణ, మల్ల శ్రీను, బర్నికాన రాము, దూలం గోపి, అప్పికొండ గణేష్, గంగుపాం జగదీశ్, కొరిబిల్లి ప్రశాంత్, సురబీ హరీష్, బుదిరెడ్డి వెంకట్, కోట్ని సూరిబాబు, పీజే, గల్లా వినోద్, గొల్లవిల్లి రాజు, పెద్దాడ సాయి, కరెట్ల లక్ష్మణ్, దివాకర్ కొండిమిల్లి, మల్ల వంశీ, మోహన్ మొహరం, వరాహల రాజు, మూర్తి, జెర్రిపోతుల కిషోర్ మరియు టీం జనసైనికులు పాల్గొన్నారు.