జర్నలిస్టులకు, సినీ ప్రముఖులకు ఆనందయ్య కరోనా మందు పంపిణి.. మెడిసిన్‌ను ఎలా వాడాలంటే!

కరోనావైరస్ కారణంగా ఇబ్బందులకు గురి అవుతున్న అనేక మందికి ఆనందయ్య మందు అద్భుతమైన వరంగా మారింది. నెల్లూరు జిల్లాలో ఆనందయ్య పంపిణి చేస్తున్న మందుతో కోవిడ్ బాధితులకు ఉపశమనం లభించడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నిర్మాత సునీల్ రెడ్డి ఈ మందును ఫిలిం జర్నలిస్టులకు, సినీ ప్రముఖులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కెఎల్ దమోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ ఇసనాకా సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్, సభ్యులకు, స్టాఫ్‌కు, మీడియా మిత్రులకు ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దాము, నిర్మాత సురేందర్ రెడ్డి, తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా నిర్మాత సునీల్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాది నెల్లూరు కావడమే కాక ఆనందయ్యతో నాకు మంచి పరిచయం ఉంది. దాంతో ఫిల్మ్ ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్, సభ్యులకు, స్టాఫ్‌తో పాటు మీడియా మిత్రులందరికీ ఆనందయ్య మందు పంపిణీ చేస్తే బాగుంటుందని కొంతమంది నిర్మాతలు తెలిపారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతల కోరిక మేరకు ఆనందయ్య మందును అందిస్తున్నాం. ప్రసన్న కుమార్, దాము,సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులకు అందించాం అని తెలిపారు.

ఆనందయ్య మందును ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఓ బఠాని గింజంత వేసుకోవాలి. అలాగే రాత్రి భోజనం చేసే ముందు ఓ బఠాని గింజంత వేసుకోవాలి. ఈ ముందు వాడిన తర్వాత రెండు రోజుల వరకు గుడ్లు, నాన్‌వెజ్, ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇది కరోనా రాని వాళ్లకు మాత్రమే.. కరోనా వచ్చి పోయిన వారు కూడా ఈ మందు వేసుకోవచ్చు. అలాగే కరోనాతో బాధ పడుతున్న వారు మాత్రం ఈ మందు వాడకూడదు. వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రం వారం తర్వాత ఈ మందు వేసుకోవచ్చు. ఈ మందు వలన ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు అని సునీల్ రెడ్డి తెలిపారు.

ఆనందయ్య మందును సుమారు 500 మంది నుంచి 700 మంది వరకు ఈ మందు సరఫరా చేస్తున్నాము. దాము, సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్ ఇంకా ఏదైనా అవసరం ఉంటే నాకు రెండు రోజులు ముందు తెలియజేస్తే నేను వారికి ఎంత అవసరం ఉందో అంత క్వాలిటీ తీసుకొచ్చి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇండస్ట్రీ అంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో నా వంతు ఇలాంటి మంచు కార్యక్రమం చేస్తున్నాను అని సునీల్ రెడ్డి పేర్కొన్నారు.