అనంత వెంకట్రాం రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు: జయరాం రెడ్డి

అనంతపురం నియోజకవర్గం: సామాజిక సాధికార బస్సుయాత్ర పేరిట మరొక మారు నగర ప్రజల్ని మోసం చేసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ మాయ మాటలు చెప్పి అనంతపురం నియోజకవర్గంలో గెలవాలనే దురుద్దేశంతో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రాం రెడ్డి నగర అభివృద్ధి గురించి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం? 2019 ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన ప్రధానమైన హామీలలో ఎన్ని నెరవేర్పించారు. డంపింగ్ యార్డ్ నగరం నుంచి తరలించార? అండర్ డ్రైనేజీ సిస్టం ఏమైంది? అండర్ పవర్ సప్లై సిస్టం ఎక్కడ? ఇలాంటి అనేకమైన హామీలు ఇచ్చారు? వీటన్నిటిని అమలు చేసి వచ్చే ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తున్నాం?. నగర అభివృద్ధికి 800 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు నగరంలో ఎక్కడ ఏం అభివృద్ధి జరిగిందో చెప్పగలరా? ఈ నాలుగున్నర సంవత్సరంలో నగరంలో అభివృద్ధి శూన్యం? అనంతపురం నగరవాసులకు జగనన్న గుహాల లబ్ధిదారులకు ఎన్ని వైయస్ జగన్ అన్న గుహాలు నిర్మించి ఇచ్చారు? డ్రైనేజీ సిస్టమును ఏమన్నా మెరుగుపరిచారా? తేలికపాటి వర్షానికే డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వస్తున్న మాట వాస్తవం కాదా? నగరంలో పారిశుద్ధ్యం ఏమైనా మెరుగుపడిందా? నగరంలో గుంతలు లేని రోడ్లు ఎక్కడ ఉన్నాయో చూపించగలరా? క్లాక్ టవర్ పక్కన కనీసం సర్వీస్ రోడ్డు కూడా వెయ్యలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉన్నది వాస్తవం కాదా? 800 కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెబుతున్నారు, కౌన్సిల్ మీటింగులో మీ కార్పొరేటర్లు బహిరంగంగా అవినీతి జరిగింది. విచారణ చేయాలని నగర మేయర్ ని డిమాండ్ చేసింది వాస్తవం కాదా? అంకెల గారడి చేస్తూ మాయమాటలు చెబుతూ నగర ప్రజలని నమ్మించాలని చూస్తున్నారు. నగర ప్రజలు పన్ను రూపంలో కట్టిన ప్రజాధనాన్ని 800 కోట్లు ఖర్చుపెట్టి నగరంలో ఎక్కడ అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? అని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.