జనసేన పార్టీలో చేరిన అనపర్తి నియోజకవర్గ ప్రముఖులు

అనపర్తి: జి.దొంతమురు గ్రామ పంచయతీ, బాలవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ బిసి నాయకులు గుబ్బల రాము, సింగంపల్లి గ్రామానికి చెందిన వైసిపి యువ నాయకుడు మరియు తన వాలంటరీ పదవికి రాజీనామా చేసి సిరిగిరెడ్డి దొరబాబు, పెద్దపూడి మండలం జి.మావిడాడకి చెందిన యాదవ సంఘం ఉపాధ్యక్షుడు కోరందాసు అప్పలరాజు యాదవ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ అశయాలు, కులాలను కలుపుకుపోయే విధానాలు నచ్చి జనసేన పార్టీ ఇంఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ రావాడ నాగు చేతుల మీదుగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండల అధ్యక్షులు వీరాస్వామి, సత్తిబాబు, వీరబాబు, ప్రసాద్ రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు కొండయ్య గోవిందు, సుంకర బుజ్జి తదితరులు పాల్గొన్నారు.