Gajuwaka: అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జనసేన కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు, గొడ్డువాన్న పాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి జనసేన నాయకులు వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు… పిల్లలు భోజనం విషయంలో ఏ విధంగా వారికి అందజేస్తున్నారు అలాగే పిల్లల యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకొని వారికి కావలసిన మౌళిక సదుపాయాల్ని కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన విశాఖ పార్లమెంట్ మాజీ అధికార ప్రతినిధి చోడిపిల్లి ముసలయ్య, విశాఖ జిల్లా సోషల్ జస్టిస్ కో కన్వీనర్ యెరీపిల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.