ప్రముఖ యాంకర్‌ ప్రదీప్ ఇంట విషాదం

ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటుడు ప్రదీప్‌ మాచిరాజు తండ్రి పాండురంగ (65) కరోనాతో మృతి చెందారు. గత కొంతకాలంగా కొవిడ్‌తో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మరోవైపు ప్రదీప్‌ కూడా కరోనాతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రదీప్‌ స్పందించలేదు. ఎన్నో వైవిధ్య కార్యక్రమాలతో బుల్లితెరపై అలరించిన ప్ర‌దీప్ సినీన‌టుడిగా వెండితెరపై కూడా హీరోగా రాణిస్తున్నాడు.  ఆయ‌న‌ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే.