ఇంకా ఆ రికార్డ్ భీమ్లా నాయక్ చేతిలోనే !!

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ గ్లింప్స్ వ్యూస్ పరంగా ఇంకా రికార్డ్స్ ను కొనసాగిస్తూనే ఉంది.

ఇదిలా ఉండగా… మొన్న స్టార్ హీరో థలా అజిత్ సినిమా వలిమై గ్లింప్స్ వచ్చింది. ఇది అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్టే లైక్స్ పరంగా ఫాస్టెస్ట్ రికార్డ్స్ కొట్టినా వ్యూస్ పరంగా మాత్రం భీమ్లా ని కొట్టలేకపోయింది. వలిమై సినిమాకి 6.8 మిలియన్ వ్యూస్ రాగా భీమ్లా కి మాత్రం 8.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి దీనితో 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన గ్లింప్స్ రికార్డ్ మాత్రం భీమ్లా నాయక్ చేతిలోనే ఉంది.