ఆడబిడ్డలకు అండ జనసేన జెండా

తాడేపల్లిగూడెం: అధినేత నిర్ణయం ఏదైనా కూడా మాకు అయిన నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తూ. ఇన్నాళ్లు ఇన్ని సంవత్సరాలుగా ఆడబిడ్డలు వాళ్ళ భద్రత కోసమే పోరాడుతున్నారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ, జనసేన అధికారంలోకి వస్తే ఆడబిడ్డలు అందరూ కూడా వాళ్ళ భద్రత కోసం కాకుండా వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడే రోజులు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారని బలంగా నమ్ముతున్న జనసేన వీరమహిళలు అంటున్నారు. చచ్చే వరకూ మా ప్రయాణం జనసేన తోనే.. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్లు సైతం ఎంత ధైర్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. సమస్యలకై పోరాడుతున్నారు అంటే ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిందే అని చెప్తున్న జనసేన వీరమహిళలు.