కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న జనసైనికుడికి అండగా నూజివీడు జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో నూజివీడు నియోజకవర్గం, వలసపల్లి గ్రామంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న జనసైనికుడు గోపి వారి కుటుంబాన్ని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన నాయకులు గునుకుల శశితేజ 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, మండల అధ్యక్షుడు అబ్బురి రవికిరణ్, మండల నాయకులు కుమ్ముకురు సురేష్, పల్లి రాజు, జనసైనికులు పాల్గొన్నారు.