ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 20వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, లింగాయపాలెం గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 20వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని లింగాయపాలెం గ్రామంలో జనసేన పార్టీ మండల నాయకులు కరపత్రాలు పంచుతూ పార్టీ సిద్ధాంతాలను, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి ప్రస్థానాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమం కొనసాగింది. గ్రామస్థులు మాట్లాడుతూ వైసీపీ పాలనపై అసంతృప్తిగా ఉన్నామని ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో తమ మద్దతు జనసేన పార్టీకే అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాళహస్తి గిరిధర్, తాండ్ర శ్రీను, శశి వర్ధన్ పాల్గొన్నారు.