అంధకారంలో ఆంధ్రా ఊటీ అరకులోయ టౌన్ షిప్ – మాదాల శ్రీరాములు

నిద్రపోతున్న అధికార యంత్రాంగం

అరకు వ్యాలి మండలం పెదలబడు పంచాయితీ పరిధిలో అరకు వ్యాలి టౌన్ షిప్ లో ఏ వీధి లో చూసిన వీధి దీపాలు వెలగక పోవడం చాలా దారుణమైన పరిస్థితి రెండు సంవత్సరాలుగా వెలగని వీధి దీపాలు పట్టించుకోని అధికార యంత్రాంగం రోడ్లు మీద తిరిగే పెద్ద పెద్ద నాయకులు నిద్రపోతున్నారా…? స్థానికకంగా ఉండే MLA కి తెలుసా తెలియదా…? అధికార పార్టీ నాయకులకు వీధి దీపాలు లేవని తెలియదా..? అధికార పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలు మర్చిపోయిన అధికారులు నాయకులు అధికారులకు నాయకులకు అన్ని అందుబాటులో ఉంటే చాలు పేద ప్రజలు ఎన్ని ఇబ్బంధులు పడిన పర్వాలేదు అనుకుంటున్న అధికారులు ప్రజా ప్రతినిధులు రెండేళ్ళు గడుస్తుంది రోడ్డు వెడల్పు చేస్తూ ఇప్పటికి పూర్తి కానీ రోడ్డు పనులు ఇంకెన్నాళ్లు పడుతుందో తెలియదు. అరకు పర్యటనకు వచ్చే పర్యాటకులు రోడ్లు బాగులేదని తిట్టుకుంటున్నారు సంవత్సరానికి వేల కోట్లు రూపాయలు వచ్చే టూరిజం ఆదాయం ఏమౌతుంది అంత అధికార పార్టీ కనుసన్నుల్లో జరిగే రోడ్డు పనులు నత్తనడక సాగుతున్న పట్టించుకోని నాయకులు అధికారులు గత ప్రభుత్వ హయాంలో యాభై లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేసారు అప్పటినుండి వెలిగి వెలుగాని వీధి దీపాలు ఉన్నవి తీసేసారు కొత్తవి ఏర్పాటు చేయడం మర్చిపోయారు ఆంధ్ర ఊటీ అరకులోయలో రోడ్లు బాగాలేదని కనీస సదుపాయాలకు కరువైందని తిట్టని పర్యటకులు లేరు ఇప్పటికైన నాయకులు అధికారులు స్పందించి అరకు వ్యాలి టౌన్ షిప్ లో విధి దీపాలు వెలిగేలా చూడాలి నత్తనడకగా రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. రోడ్డు వెడల్పు పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ నాయకుడు మాదాల శ్రీరాములు ఈ సందర్భముగా డిమాండ్ చేశారు.