*ఒక్క సామాజిక పింఛన్ లకే ఏడాదికి 33 వేలు ఖర్చు పెడుతున్న కూటమి ప్రభుత్వం
*అభివృద్ధి – సంక్షేమం రెండు కళ్లుగా సుపరిపాలన
*కటిక చీకటి నుంచి దేధీప్యమైన వెలుగులోకి ఆంధ్రప్రదేశ్
*మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల నాయకత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం
*వేకువజాము నుంచే పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్ లు పంపిణీ చేసిన జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పధకాలు అమలు చేయటమే కాకుండా సుమారు 66 లక్షల మందికి నెల నెలా సామాజిక పింఛన్ లను పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామాగా మారిందని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మంగళవారం స్థానిక 22వ డివిజన్ లోని 70, 71, 72 సచివాలయాల పరిధిలో వేకువజాము నుంచే సచివాలయం సిబ్బందితో కలిసి అయన పింఛన్ లను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ విప్లవం మొదలైందన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని సంవత్సరం తిరగకుండానే నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. ఒక్క సామాజిక పెన్షన్ లకే సంవత్సరానికి 33 వేల కోట్లు ఖర్చు చేయటం దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారంటూ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో సువరిపాలన సాగుతుందని , ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధిపధంలో దూసుకెళ్తుందంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ చీకటి పాలనా యుగం నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దేదీప్యమైన వెలుగులోకి తీసుకెళ్తున్నారంటూ కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూటమి పాలనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది జయంద్ర ప్రభు, బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment