వైసీపీ ఊసే లేని ఆంధ్రప్రదేశే లక్ష్యం: నేరేళ్ళ సురేష్

గుంటూరు, ప్రజలిచ్చిన అధికారాన్ని అడుగడుగునా దుర్వినియోగం చేయటమే కాకుండా తన అసమర్ధ పాలనతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మండిపడ్డారు. 12వ డివిజన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. చందన బ్రదర్స్ నుంచి ప్రారంభమై మెదర బజార్ మీదుగా పెద్దపులి సందు పెద్ద మసీదు వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ ఊసేలేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. వైసీపీ అరాచకాలకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలెవరూ అధైర్యపడవద్దని రానున్న అరవై రోజుల అనంతరం రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయన్నారు. రాష్ట్రం ఒక నియంత చేతిలో చిక్కి అల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంభేడ్కర్ రాజ్యాంగం బదులు జగన్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛని రాష్ట్ర ప్రజలు కోల్పోయారన్నారు. నాలుగేళ్ల పది నెలల కాలంగా సాగుతున్న వైసీపీ దాష్టీకాలను ప్రశ్నిస్తే ఎంతటివారినైనా నిర్బంధిస్తున్నారని, అరెస్ట్ లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకి ఏదన్నా కష్టమొచ్చినా, ఎలాంటి ఆపద కలిగినా ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటారన్నారు. అలాంటిది కంటికి రెప్పలా కాపాడాల్సిన నేతలే సమస్యగా మారితే ప్రజలు ఇంకెవ్వరికీ చెప్పుకోవాలన్నారు. వైసీపీ నేతలు పంచభూతాలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. ఈ పాలన ఎప్పుడు విరగడవుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకం అవుతూ మేమున్నాం అన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలిచ్చిన గొప్ప పాలనా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోనున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావటం తధ్యమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి లక్ష్మీ దుర్గ, యర్రంశెట్టి పద్మావతి, పాకనాటి రమాదేవి, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, నగర కమిటీ సభ్యులు సాగర్, కోటి, రవీంద్ర, నవీన్, యడ్ల మల్లి, బాషా, కిషోర్, కిట్టు, అశోక్, శ్రీను, మల్లీశ్వరి, ఆసియా, గుండాల శ్రీను, మాధవి, ఆశా, రాధిక, అరుణ, అలివేలు, హరి సుందరి, సాంబ్రాజ్యం, కోలా పద్మావతి, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.