పవన్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది: కరిమజ్జి మల్లీశ్వరావు

  • పవనన్న ప్రజాబాట 56వరోజు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రావాడ గ్రామ చెరువులో ఉన్న ఉపాధి కూలీలతో జనసేన పార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు శుక్రవారం మధ్యాహ్నం చెరువులో పర్యటించడం జరిగింది. చెరువులో ఉన్న ప్రతి ఒక్కరిను కలవడం జరిగింది. జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి మహిళకు, యువతకు, పెద్దలకు, తెలియజేయడం పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 56 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి రావాడ గ్రామ జనసైనుకులకు శిక్షణ ఇచ్చి 10 లేక 20 మందిని గ్రామానికి నాయకులుగా తయారు చేయాలని ధృడ సంకల్పంతో మల్లీశ్వారావు చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపికి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో రావాడ గ్రామ, ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.