తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అంగులూరి లక్ష్మి

పాయకరావుపేట నియోజకవర్గం: నక్కపల్లి వివార్స్ కాలనీ, రాజానగర కాలనీ తుఫాన్ ప్రభావంతో ఇండ్లలోకి నీరు వచ్చి పూర్తిగా మునిగి పోవడంతో కాలనీ మొత్తం జనసేన పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి ఆదేశాలు మేరకు జనసేన నాయకురాలు మాజీ యమ్ యల్ సి అంగులూరి లక్ష్మి శివ కుమారి కాలనీనీ సందర్శించారు. నష్టపరిహారం అందేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వెలగా సుధాకర్, యగదాసు నానాజి, నల్లల రత్నాజి, కోసూరి నాని, పేకేటి వినోద్ రాయల్స్, కర్రి దుర్గ, భాస్కర్, దుర్గ, తూమ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.