*సేవా స్పూర్తితో విద్యార్థులకు సంతోషం పంచిన జనసేన
జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు, ఐటీ కోఆర్డినేటర్ పులిపాటి అనిల్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆత్మకూరు టౌన్ జనసేన నాయకుడు గడ్డం వంశీ కృష్ణ ఆధ్వర్యంలో ఆదిఆంధ్ర ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. విద్యార్థులకు నోటుబుక్స్, పెన్సిల్స్, పెన్లు వంటి విద్యా సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు, పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి, వారితో కలిసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, బోధన సిబ్బంది అనిల్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉల్లాసంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కొండా గణేష్, పల్లవోలు శ్రీహరి, ఆత్మకూరు నాగరాజు, ఉసూరుపాటి శ్రీనివాసులు, కొండ సాయి, కప్పల బాబీ, మొద్దు ఖాజా, కొండా సుధాకర్, కప్పల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment