విజయనగరం: అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెలవారీ సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం 42వ డివిజన్, కామాక్షి నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో క్వీన్స్ ఎన్.ఆర్.ఐ. హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) మాట్లాడుతూ నెలవారీ చేసే సేవాకార్యక్రమాల్లో భాగంగా శిబిరాన్ని నిర్వహించామని, ఈ శిబిరానికి మంచి స్పందన లభించిందని, స్థానిక ప్రజలు వినియోగించుకున్నారని, ఆరోగ్యమే మహాభాగ్య మనే నినాదంతో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. క్వీన్స్ ఎన్.ఆర్.ఐ, హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు మోహనరావు, ప్రసాద్, లిఖిత వైద్యసేవలందించిన ఈ శిబిరంలో విచ్చేసిన కాలనీ వాసులకు బీపి, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ, జి. సూర్యప్రకాశరావు, శ్రీను పవన్ పాల్గొన్నారు.
Share this content:
Post Comment