‘బీపి, షుగర్’ పరీక్షలు నిర్వహించిన “అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్”

విజయనగరం, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం, 42వ డివిజన్ పరిధిలో అయ్యన్నపేట, ఎస్సీ కాలనీలో, వాసవి డయోగ్నోస్టిక్ సెంటర్ సౌజన్యంతో బీపి, షుగర్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) మాట్లాడుతూ నెలవారీ చేసే సేవాకార్యక్రమాల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన, జాగ్రత్తలను కల్పించడమే లక్ష్యంగా వాకర్స్ క్లబ్స్ పనిచేస్తాయని అన్నారు. సుమారు వందమంది పరీక్షలు చేసుకున్న ఈ శిబిరంలో వాసవి డయోగ్నోస్టిక్ సెంటర్ డాక్టర్ హేమసుందర్, టెక్నీషియన్ అభిషేక్ సేవలందించారు.కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. మురళీమోహన్, క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, జనసేన నాయకులు కర్రోతు ఆనంద్, శివమణి పాల్గొన్నారు.