అంకమ్మ తల్లి తిరుణాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, రాజుపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని సైకో ప్రభుత్వం నుంచి కాపాడాలని రానున్న ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ తరఫున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోమిశెట్టి సాంబశివరావు, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు ముప్పాళ్ల మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, ఏడవ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, బృగుబండ ఎంపీటీసీ శివ, నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, రామిశెట్టి శీను, దార్ల శ్రీను, కడియం అంకమ్మరావు, చిలకాపూర్ణ ప్రచార కమిటీ మెంబర్ బత్తుల కేశవ, తులవ నరేంద్ర, ఏసుబాబు వీరమహిళలు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.