ఏ ఎన్ ఎం లను రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రెగ్యులర్ చేయాలి

  • ఏ ఎన్ ఎం ల నిరువధిక సమ్మెకు మద్దతు తెలిపిన జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రములో కలెక్టర్ ఆఫీస్ దగ్గర గత మూడు రోజులుగా ఏ ఎన్ ఎంలను పర్మినెంట్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరువధిక సమ్మెకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వేముల కార్తిక్ మాట్లాడుతూ.. నోటిఫికేషన్ నెం. 02/2023ను క్యాన్సిల్ చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంపిహెచ్ (ఫిమేల్)ల సర్వీసులను క్రమబద్ధీకరించాలి, 11వ పి.ఆర్.సి. ప్రకారం కనీస వేతనం (బేసిక్) రూ.31,040/-లతో బాటు డి.ఏ., హెచ్.ఆర్.ఏ. ఇతర అలవెన్సులు ఇవ్వాలి. పెండింగ్ ఎరియర్స్ వెంటనే ఇవ్వాలి. వ్యాక్సిన్ అలవెన్స్ 500 రూపాయలతో పాటు యూనిఫాం అలవెన్స్2,500 ఇవ్వాలనీ 4.180 రోజుల వేతనంతో కూడిన మెటర్నటీ లీవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి. నైట్ డ్యూటీలు, ఓ.పి. డ్యూటీలు రద్దు చేసి బదిలీకి అవకాశం కల్పించాలి. విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వడం తో పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.ఫీల్డ్ డ్యూటీ చేస్తున్నందున ఎఫ్.టి.ఏ. సౌకర్యం కల్పించాలని ఏ ఎన్ ఎంలకు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని అలాగే ఈ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ ఎండి.సాదిక్, పాషా చుంచుపల్లి వైస్ ప్రెసిడెంట్ ఈ. అనిల్, సెక్రెటరీ బాలకృష్ణ మరియు పాల్వంచ మండలం టౌన్ ప్రెసిడెంట్ కాసిం, ఉపాధ్యక్షులు సంపత్, వైస్ ప్రెసిడెంట్ జానీ బాయ్, నవభారత్ శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.