అన్నదానం మహా ప్రసాదం: రాహుల్ సాగర్

మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ఎమ్మిగనూరు, తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి వారంలో ఒకరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ వారం అయిన మంగళవారం పట్టణంలోని స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్నదానాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని, ఆకలితో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తమ వంతు సహాయాన్ని అందించాలని కోరారు. ఎమ్మిగనూరు మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ సీనియర్ నాయకులు కర్ణం రవి, రసీదు వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.