అన్నమయ్య వరద బాధితులను ఆదుకోవాలి: మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట, అన్నమయ్య వరద బాధితులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాజంపేట ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. గురువారం అమ్నమయ్య వరద బాధితుల అవస్థల గురించి జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని ఎల్లమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మలిశెట్టి వెంకటరమణకు సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి ఫ్లై ఓవర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు జనసేన, టిడిపి నాయకులు సంయుక్తంగా ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఆర్డీవో రామకృష్ణారెడ్డికి అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్థి జగన్మోహన్ రాజు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, కడప జిల్లా లీగల్ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రాజు, ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు బాషా, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.