బోనెల మాధవరావుకు మనోధైర్యాన్నిచ్చిన అన్నవరం హెల్పింగ్ హేండ్స్

శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, డి.గొనపపుట్టగలో ఎస్సీ స్ట్రీట్ బోనెల మాధవరావుకు గత కొద్దిరోజులు క్రితం నుండి ఆరోగ్య పరిస్థితి బాగోలేనందువలన ఆయనకు మందులు ఖర్చులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేద బాధను గూర్చి ఆ గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న వెంటనే అన్నవరం హెల్పింగ్ హేండ్స్ స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు స్పందించి వారి గ్రామానికి వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న మాధవరావు ఇంటి ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉందని తెలిసి తక్షణ సాయంగా పత్రిక ప్రతినిధి కె.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆయన మందులు ఖర్చులు నిమిత్తం 3000/ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గోపి, ప్రవీణ్, పవన్, గ్రామస్తులు పిసా మహేష్, ప్రదీప్, కాలి, వెంకటేశ్వరరావు, యువత, మహిళలు పాల్గొన్నారు.