జనసేనానికి చెరుకువాడ రైతుల ధాన్యాభిషేకం, పాలాభిషేకం

ఉండి నియోజకవర్గం, ఉండి మండలం, చెరుకువాడ గ్రామంలో జనసేన పార్టీ అధ్వర్యంలో కౌలు రైతుల ఆత్మహత్యలపై చలించి వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా నిలవడం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన సోంత డబ్బు 5 కోట్లు రుపాయలు పార్టీకి అందించి.. రాష్ట్రంలో చనిపోయిన 1000 మంది కౌలు రైతు కుటుంబాలను అదుకోవటానికి ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలని ముందుగా తనవంతు ఆర్థిక సాయంగా ఒక్కో కుటుంబానికి 1లక్ష రూపాయలు అందిస్తూ.. ప్రారంభించిన రైతు భరోసా యాత్రను స్వాగతిస్తూ.. చెరుకువాడ గ్రామానికి చెందిన కౌలు రైతులు, సన్నకారు, చిన్నకారు రైతులు మువ్వ వెంకటేశ్వరరావు, పడమటి త్రిమూర్తులు, మంతెన నర్సింహ రాజు, మాణ్యం మురళి, చుక్క ఏడుకొండలు, పెనుమత్స రంగరాజు, మాణ్యం గంగా నాగేశ్వరరావు, మంతెన సుబ్బరాజు, కుచ్చు రామాంజనేయులు,
మహిళలు నక్క దుర్గ, నక్క పెద్దింట్లు, పడమటి రామలక్ష్మి, ఉండి మండల అధ్యక్షులు యడవల్లి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, జన సైనికులు కుచ్చు శివ కృష్ణ, బొల్ల శ్రీనివాసు, మద్దాల శివ, బండి రమణ, కోట సజ్జనరావు, కట్ట చిరంజీవి, బొల్ల నాని, ఆరేటి గోపి నాథ్, అయితం హనుమాన్, తోండవరపు నాగ వర్ధన్, యాతం ఉదయ్, యర్రా రవి, పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ధాన్యాభిషేకం, పాలాభిషేకం చేయటం జరిగింది. అనంతరం రైతులు, నాయకులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాన్ని రైతులు అందరూ స్వాగతిస్తున్నామని, ఆయన రైతుల పక్షాన పోరాటం చేయటం అభినందనీయమని, భవిష్యత్ లో అందరూ ఆయనకు మద్దతుగా నిలిస్తే ఏర్పడేది జనసేన రైతు ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు, జన సైనికులు, నాయకులు పాల్గొన్నారు.