ఆలపాటి గెలుపు కూటమికి మరొక చారిత్రాత్మక విజయం..!

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82319 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఐటీ వింగ్ గుంటూరు జిల్లా తరుపున రాష్ట్ర ఐటీ కో-ఆర్డినేటర్ చవ్వాకుల లీలా కోటేష్ బాబు నేతృత్వంలో దాదాపు 1000 ఓట్లు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా నమోదు చేయించబడినట్లు తెలిపారు. సుమారు 5000 మంది గ్రాడ్యుయేట్ మిత్రులతో కలసి, మన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మద్దతు ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానంలో ప్రచారం నిర్వహించబడింది. ఆన్‌లైన్ మీటింగ్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఐటీ విభాగం వారిని సన్నద్ధం చేయటం జరిగింది. ఈ విజయంలో భాగస్వాములైనందుకు జనసేన పార్టీ ఐటీ విభాగం గర్వపడుతోందని, గుంటూరు జిల్లా ఐటీ కో-ఆర్డినేటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share this content:

Post Comment