వైసీపీ పాలేరులు పిచ్చి వాగుడు ఆపాలి: తిరుపతి అనూష

విజయవాడ, కాపు పెద్దలు అంతా పవన్ కళ్యాణ్ గారికి మద్దత్తు ఇవ్వరంట. ఎవరు పెద్దలు…? ఎవరు ఇచ్చారు మీకు పెద్దరికం..?
కులం పేరు చెప్పి పబ్బం గడుపుకునే ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ కి ఉచిత సలహా ఇచ్చేవాళ్లే. సింగల్ గా పోటీ చేసినప్పుడు మీరంత ఎక్కడ పోయారు….? మీ కాపు సంఘాలుఎక్కడ ఉన్నాయి…? మీరందరూ అప్పుడు నిద్రపోతున్నారా..? ముందు వైసిపిలో కాపు నాయకులు అందర్నీ మూకుమ్మడిగా రాజీనామా చేయమని చెప్పి ప్రెస్ మీట్ లు పెట్టండి. ఏ వాళ్ళని అడగలేరా…? ఆంధ్రప్రదేశ్ బాగుకోసం ఎంతో ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని ఒక కులం పేరు చెప్పి కొంతమంది పాలేరులతో ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డిని త్వరలోనే ప్రజలు తరిమికొడతారు. కాపులే కాదుమనవత్వం ఉన్న మనుషులు ఎవ్వరూ కూడ పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఆయన కష్టపడిన సొమ్ముని ప్రజలకు పంచిపెడుతున్నారు. అలాంటి వ్యక్తి గురించి కొంతమంది పనికిమాలినోళ్లు మాట్లాడితే పట్టించుకొనే పరిస్థితి లో ఎవరూ లేరని తిరుపతి అనూష అన్నారు.