ఘనంగా జనసేన జెండా స్థూపాన్ని ప్రారంభించిన అనుశ్రీ

రాజమండ్రి సిటీ, స్థానిక 46 వార్డులో సంయుక్త కార్యదర్శి పొట్నూరు శ్రీనివాస్ (ఠాగూర్) ఆధ్వర్యంలో జనసేన స్థూపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా అక్కడున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అనుశ్రీ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఆయనకు ప్రజలు మంగళహారతులు, తీన్మార్ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటూ వార్డ్ ను సందర్శించారు. అనంతరం జనసేన స్థూపం ఆవిష్కరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకి జనసేన పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని, పవన్కళ్యాణ్ ఆశయం మేరకు అధికారపార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా తమపార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మచ్చలేని నాయకులని వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నగర ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. వైస్సార్సీపీ మంత్రులందరూ బూతు మంత్రులని పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తున్నారన్నారు. కాపులు వందశాతం పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ కి 10 లేదా 20 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వై వి డి ప్రసాద్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నాడ శ్రీను, రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి ఏడిద బాబి, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు పైడిరాజు నల్లంశెట్టి వీరబాబు అల్లంగి నాగేశ్వరరావు, కార్యదర్శులు అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, విన్న వాసు సంయుక్త కార్యదర్శులు దేవకివాడ చక్రపాణి అలివేలు మంగతాయారు జనసేన యువనాయకులు బయ్యపునీడి సూర్య జనసైనికులు నర్సిపూడి రాంబాబు మంచాల సునీల్ వెంకటేష్ ఏడి ప్రసాద్ లోవరాజు కుప్పిలి రాఘవ 39 వార్డ్ దుర్గాప్రసాద్ మరియు ఠాగూర్ మిత్రబృందం మంచాల సునీల్ మిత్ర బృందం మరియు బయ్యపునీడి సూర్య మిత్ర బృందం దుర్గా ప్రసాద్ మిత్రబృందం మరియు వీరమహిళలు మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.