ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా.. అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. అసెంబ్లీలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్లా రామకృష్ణ రెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు.