బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సర్కార్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మద్యంప్రియులకు మరో గుడ్ న్యూస్ అందించింది. నేటి నుండీ బార్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 840 బార్ల లైసెన్స్‌లను 2021 జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం, వాటిపై 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను 10 శాతం పెంచుతూ.. విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యంపై 10 శాతం ఏఈఅర్జీ విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.