అంతర్ రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసిన ఏపి

ఆంధ్రప్రదేశ్ లో అంతర్ రాష్ట్ర రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర రవాణాపై నిషేధాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు వచ్చే వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరు. ఏపీలోకి ప్రవేశించాలంటే ఎలాంటి పాస్ లు అనుమతి అవసరం లేదు. పొందుగుల చెక్ పోస్టు వద్ద ఆంక్షలను తొలగించారు.

రీల్ హీరో రియల్ హీరోగా మారాడు. ఆయన మరెవరో కాదు ఖిలాడీ కుమార్ అక్షయ్. ఇంగ్లండ్ కు చెందిన బేర్ గ్రిల్స్‌తో కలిసి దట్టమైన అడవిలో సాహసాలు చేశారు. డిస్కవరీ ఛానెల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో రూపొందుతున్న ఈ కార్యక్రమం కోసం అక్షయ్ ఈ ఫీట్ చేశాడు. ఈ కార్యక్రమం డిస్కవరీ ప్లస్ యాప్ లో సెప్టెంబర్ 11న విడుదల కానుంది. సెప్టెంబర్ 14న డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కానుంది.