ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా, ఆదేశించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శనంలో, రాష్ట్ర టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు, ఆత్మకూరు మండలం నారంపేటలోని ఏపీఐఐసీ-ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన మరియు ప్రజా వేదిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు మరియు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ పులిపాటి అనిల్ కుమార్ తో పాటు పసుపులేటి శ్రీరామ్, ఎస్‌పేట మండల అధ్యక్షుడు సయ్యద్ అక్బర్ బాషా, ఆత్మకూరు టౌన్ నాయకులు గడ్డం వంశీకృష్ణ, మర్రిపాడు మండల సీనియర్ నాయకులు చిన్నా జనసేన, వనం పవన్ కుమార్, రూరల్ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీను, ఉప్పుగళ్ళ శ్రీనివాసులు, ప్రవీణ్ మరియు అనేకమంది జనసైనికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనదలచిన వారికి విఐపి పాసులు అందించడంలో సహకరించిన టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కి, ఆ పాసులు జారీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారి టీం, ముఖ్యంగా అష్రఫ్ అన్న సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల జనసైనికులందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment