పలుకుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం ముమ్మిడివరం టౌన్ 3వ వార్డులో చింతలమేరకు గ్రామంలో అనారోగ్యంతో మరణించిన రెడ్డి రాఘవమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముమ్మిడివరం మండలం బూరెలంక గ్రామంలో హార్ట్ ఎటాక్ తో మరణించిన కేబుల్ మధు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు వడ్డుగూడెం గ్రామంలో యాక్సిడెంట్ లో మరణించిన రాయుడు దుర్గాప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మీరు వెంట కడలి వెంకటేశ్వరరావు విత్తనాలు అర్జున కడలి రామకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.