అపోలోలో అనాటోమిజ్‌ 3డి ప్రింటర్లు

ప్రముఖ ప్రైవేట్  వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌ కొత్తగా 3డి ప్రింటింగ్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఇందుకోసం అనాటోమిజ్‌ 3డి మెడ్‌టెక్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు తెలిపింది. బుధవారం అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి వర్చువల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రింటర్ల ద్వారా వైద్యులు క్లిష్టమైన ఇంప్లాంట్లను ఊహించడంతో పాటు వాటిని ముద్రించవచ్చన్నారు. వీటిని తొలి సారి తాము జూబ్లిహిల్స్‌ హాస్పిటల్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ”వైద్య సంరక్షణను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వేగవంతమైన, ఖచ్చితమైన పరిష్కారాలను అందిస్తుంది. భవిష్యత్‌ మార్పుకు 3డి-ప్రింటింగ్‌ అనేది ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. రోగి నిర్దిష్ట కట్టింగ్‌, డ్రిల్లింగ్‌ గైడ్లులు, ఇంప్లాంట్‌ అచ్చుతో మెడికల్‌ 3డి ప్రింటింగ్‌ సేవలను అందిస్తాయి” అని ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు.