జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ-ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా శాఖలు, మహిళా బీసీ సంఘాల ప్రతినిధులు, స్థానిక జనసేన నాయకులు శనివారం సాయంత్రం విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడుని ఏలూరు జనసేన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలనే అంశాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సూచించాల్సిందిగా అభ్యర్థించారు. తల్లికి వందనం పథకం ద్వారా బీసీ కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని అభినందించారు. భవిష్యత్తులో బీసీ సంఘాలకు తాను పూర్తిగా అండగా నిలుస్తానని, ఏ అవసరమైనా ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని రెడ్డి అప్పల నాయుడు హామీ ఇచ్చారు. ఏలూరులో బీసీల కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు లక్కోజు రాజగోపాలాచారి (గోపీ), పామర్తి యేసు రాజు, విఠల్ కుమార్, ఉక్కుసూరి గోపాలకృష్ణ, పూలు ఆంజనేయులు, పట్నాల శేషగిరిరావు, మూతిక రాఘవమ్మ, కిలారిశెట్టి సంధ్యా శ్రీలక్ష్మి, బాయి వెంకటరావు, కొండల ప్రసాద్, జరజాపు ఉమా, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment