రేషన్ కార్డులో గుర్తు తెలియని వ్యక్తిని తొలిగించాలని అధికారులకి విజ్ఞప్తి!!

  • పట్టించుకోని అధికారులు.
  • సమస్య పరిష్కారం దిశగా తీసుకువెళ్లిన జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

పాలకొండ మండలం గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఎఫ్.పి.షాపు నంబర్:56 బొమ్మలి రేయమ్మ వైఫ్ ఆఫ్ లేటు బొమ్మలి పాపారావు రేషన్ కార్డు యందు కోటబొమ్మళి ప్రాంతానికి చెందిన గవర్నమెంట్ ఉద్యోగరాలు ఈ కార్డులో అధికారుల తప్పిదం వల్ల యాడ్ అవ్వడం జరిగింది. మూడు సంవత్సరాల నుండి తొలగించండి మాకు గవర్నమెంట్ కి సంబంధించిన రేషన్ దగ్గర నుండి ఉచిత పథకాల వరకు ఏ ఒక్కటీ అందట్లేదని మండల అధికారులు దగ్గర నుండి జిల్లా కలెక్టర్ దగ్గరకు మరియు ప్రస్తుత మన్యం పార్వతీపురం జిల్లా కలెక్టర్ వరకు మొరపెట్టుకొని రేషన్ కార్డులో యాడ్ అయిన వ్యక్తిని తొలగించండి అంటూ వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ఏ అధికారులు పట్టించుకోలేదు. ఈ సమస్య స్థానిక పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మండల అధికారులు ఎంపిడివో డొంక త్రినాధరావుని కలిసి విషయాన్ని తెలియచేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి తొలగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.