అక్రమ కేసుకు కోర్టులో హాజరు

*వైసీపీ అరాచకాలకు ఎదురు నిలిచిన కావలి జనసేన

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా 2023 సెప్టెంబరు 4న కావలిలోని 17మంది జనసేన కార్యకర్తలపై దాఖలు చేసిన కేసు సందర్భంగా, ఈనెల 30న కావలి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆ1గా ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ అళహరి సుధాకర్ గారు కోర్టుకు హాజరయ్యారు. వారితో పాటు, జనసేన లీగల్ సెల్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చదలవాడ రాజేష్ వకాల్తా పుచ్చుకొని నాయకులకు న్యాయపరంగా అండగా నిలిచారు. తదుపరి విచారణను కోర్టు ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, అళహరి సుధాకర్, చదలవాడ రాజేష్, రీజినల్ కో ఆర్డినేటర్ నాగరత్నం, టౌన్ అధ్యక్షుడు పొబ్బా సాయి, కో ఆర్డినేటర్ రిషికేశ్, వీర మహిళ కందుల లక్ష్మి తదితరులు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు భయపడకుండా జనసేన ధైర్యంగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం అందించిందని వారు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో క్రమశిక్షణతో పని చేయాలని రాజేష్ పిలుపునిచ్చారు. అక్రమ కేసులో అళహరి సుధాకర్ తో పాటు మొత్తం 17 మంది నాయకుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా కోర్టుకు వచ్చి మద్దతు తెలిపిన జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share this content:

Post Comment