అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించటం దుర్మార్గం

అరకు: శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ అమలు పరచటంతో పాటు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించటం దుర్మార్గమైన చర్య అని అరకు జనసేన పార్టీ ఇన్చార్జి చెట్టి చిరంజీవి తెలిపారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిప్కరించగపోగా పై చర్యలకు పాల్పడటం శోచనీయం. సమస్యలను పరిష్కరించడం చేతకాక వారి ఉపాధి జోలికి వెళ్తే ప్రభుత్వం అంగన్వాడీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని గ్రహించాలి.